: వ్యాపారుల తంటాలు... పాల ట్యాంకర్‌లో డ్రైవర్ సీటు కింద రూ.20 లక్షల పాతనోట్లు స్వాధీనం


దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోన్న నల్లధనం, నకిలీ నోట్ల నిరోధానికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సంచలన నిర్ణయం ధాటికి అక్రమంగా డబ్బు కూడబెట్టిన వ్యాపారులు ఎన్నో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. బ్యాంకుల్లో న‌ల్ల‌ధ‌నాన్ని మార్చుకునే వీలు లేక‌పోవ‌డంతో అక్ర‌మ‌మార్గాల్లో డ‌బ్బును మార్చుకోవాల‌ని చూస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ డెయిరీకి చెందిన పాల ట్యాంకర్‌ను త‌నిఖీ చేసిన హైద‌రాబాద్ శివారులోని మ‌ణికొండ‌ పోలీసుల‌కు డ్రైవ‌ర్ సీటు కింద రూ.20 లక్షల పాతనోట్ల క‌ట్ట‌లు క‌నిపించాయి. సాధారణంగా త‌మ న‌గ‌దును మరో సంస్థకు బ‌దిలీ చేస్తామని, అయితే సదరు సంస్థ పాత నోట్లను తీసుకోమ‌ని చెప్పిందని, దీంతో ఆ పాత‌నోట్ల‌ను రైతులకు చెల్లించేందుకు తీసుకెళుతున్నామని పట్టుబడ్డ డ్రైవర్ చెప్పాడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News