: నేను టీఆర్ఎస్ లోకా? ఛీ ఛీ... అలాంటిది లేదు!: మధుయాష్కి


తెలంగాణ ప్రజలను తీవ్రంగా వంచిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో తాను చేరే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ మధుయాష్కి స్పష్టం చేశారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, భవిష్యత్తులో మీరు టీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు "ఛీ ఛీ ఛీ ఛీ ఛీ... చాన్సే లేదు. రాజకీయం నా జీవితం కాదు. తెలంగాణ పౌరుల భవిష్యత్తు బాగుండాలన్నదే నా అభిమతం. తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి కాంగ్రెస్ తో పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెప్పించడంలో నా వంతు పాత్ర పోషించాను. ఉద్యమ పార్టీగా చెప్పుకుని, ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీలో చేరేందుకు నాకేమీ వ్యాపారాలు లేవు. డబ్బు సంపాదించాలన్న ఆశ లేదు" అని మధుయాష్కి చెప్పారు.

  • Loading...

More Telugu News