: కస్టమర్లు లేక ఖాళీగా కనిపిస్తున్న రెస్టారెంట్లు.. అంద‌రి దారులు బ్యాంకులు, ఏటీఎంల వైపే!


నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభావం అన్ని రంగాలపైన పడుతోంది. సాధారణంగా శని, ఆదివారాల్లో క‌స్ట‌మ‌ర్లతో నిండిపోయి క‌నిపించే రెస్టారెంట్లు బోసిపోయి ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. చిల్ల‌ర లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు వీకెండ్ పార్టీల‌కు దూరంగా ఉన్నారు. రెస్టారెంట్లు, పార్టీల వైపుకు చూడ‌డం లేదు. అంద‌రి దారులు బ్యాంకులు, ఏటీఎంల వైపే ఉన్నాయి. రోడ్డు పక్కన ఉండే చిన్న‌పాటి రెస్టారెంట్లలో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను వినియోగించుకునే సౌకర్యం లేక‌పోవ‌డంతో, వినియోగ‌దారుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ప‌లు రెస్టారెంట్లు ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు చెల్లిస్తే, ఇంటికి పార్శిళ్లు పంపుతామ‌ని పేర్కొంటున్నాయి. అన్ని రెస్టారెంట్ల ముందు చిల్ల‌ర తెచ్చుకోవాల‌నే సూచనలతో కూడిన బోర్డులు క‌నిపిస్తున్నాయి. మరోపక్క, బిజెంస్ లేక తాము తీవ్రంగా న‌ష్ట‌పోతున్నామ‌ని రెస్టారెంట్ల నిర్వాహ‌కులు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News