: పెద్దనోట్ల మూటలు వున్నాయంటూ ప్రచారం.. పెద్ద ఎత్తున చేరుకుంటున్న ప్రజలు.. భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ఫ్లై ఓవర్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడ ఎవరో పెద్ద నోట్ల మూటలు పడేశారని పుకార్లు వచ్చాయి. ఈ విషయం ఒకరి నుంచి మరొకరికి పాకడంతో నోట్ల కట్టలను తీసుకోవాలనే ఆశతో పెద్ద ఎత్తున జనం అక్కడకు చేరుకుంటున్నారు. అటు నుంచి వెళుతోన్న వాహనదారులు కూడా తమ బండ్లను పక్కకు పెట్టి మరీ డబ్బుల కోసం అటూ ఇటూ తిరుగుతున్నారు. నోట్ల కట్టలు ఎక్కడ పడి ఉన్నాయంటూ వెతుకులాట మొదలెట్టారు. మరోపక్క, పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో వస్తోన్న పుకార్లను నమ్మకూడదని, వదంతులు వ్యాప్తి చేస్తోన్న వారికి శిక్ష తప్పదని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.