: ట్రంప్ క్యాబినెట్లో ఇండో అమెరికన్ బాబీ జిందాల్!
రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడాలని భావించి, ఓ దశలో ట్రంప్ కు గట్టి పోటీ ఇచ్చి, ఆపై వెనుకబడిపోయి, టెడ్ క్రూజ్ కు మద్దతు తెలుపుతూ వెనక్కు తగ్గిన ఇండో అమెరికన్ బాబీ జిందాల్ కు ట్రంప్ క్యాబినెట్లో స్థానం లభించవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే, అమెరికా అధ్యక్షుడి క్యాబినెట్లో స్థానం సంపాదించుకున్న తొలి ఇండో అమెరికన్ జిందాల్ కానున్నారు. రెండుసార్లు లూసియానా గవర్నర్ గా ఎంపికైన బాబీ పేరును ఇప్పటికే ట్రంప్ తన మంత్రుల జాబితాకు ఎంపిక చేసినట్టు 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆరోగ్య శాఖను ఆయనకు అప్పగించవచ్చని ట్రంప్ వర్గంలోని నేత బెన్ కార్సన్ వ్యాఖ్యానించారు. జిందాల్ కు ఉన్న దీర్ఘదృష్టి, అమెరికా రాజకీయాలపై పట్టు తదితర కారణాలతో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.