: నిధులు ఖర్చు పెట్టలేదని పార్లమెంటు నుంచి ముగ్గురు మంత్రుల డిస్మిస్
ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంట్ నుంచి ముగ్గురు ఎంపీలు డిస్మిస్ అయ్యారు. బడ్జెట్ నిధులను అభివృద్ధికి వినియోగించడంలో విపలమయ్యారని ఆరోపిస్తూ, విదేశాంగ మంత్రి సలాహుద్దీన్ రబ్బానీ, ప్రజాపనుల మంత్రి మహమూద్ బలిగ్, శ్రామిక, సామాజిక వ్యవహారాల మంత్రి నస్రీన్ ఒర్యాఖెల్ లను నోకాన్ఫిడెన్స్ ఓటుతో ఆఫ్ఘన్ పార్లమెంటు డిస్మిస్ చేసింది. అఫ్ఘన్ పార్లమెంటు తీసుకునన్ ఈ నిర్ణయాన్ని అబ్దుల్ రవూఫ్ ఇబ్రహిమి వెల్లడించారు. కాగా, కొత్త సభ్యులను అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ నియమించాల్సి ఉంది.