: ఉప్పు కొరతలేదు...పుకార్లను నమ్మవద్దు: ఈటల


దేశంలో ఉప్పు కొరత వస్తోందని వివిధ పట్టణాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. తెలంగాణలో ఉప్పుకొరత లేదని అన్నారు. ఉప్పు కొరత రానుందంటూ వదంతులు వ్యాపింపజేసినా, లేదా నల్లబజారులో ఉప్పు అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఉప్పు కొరత వదంతులపై ఎవరూ ఆందోళనకు గురికావొద్దని, అలాంటి పరిస్థితులేవీ లేవని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్, హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో గత రాత్రి పుకార్లు షికార్లు చేయడంతో కేజీ ఉప్పును 300 రూపాయలు, 400 రూపాయలు పెట్టి కొనుగోలు చేసినట్టు వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News