: ఇంగ్లండ్ ఆధిక్యం 163 పరుగులు...డ్రా దిశగా మొదటి టెస్టు?


రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో రోజు ఆటముగిసింది. 319/4 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు మరో 169 పరుగులను జత చేసి, 488 పరుగులకు ఆలౌటైంది. మూడోరోజు రాణించిన టీమిండియా ఆటగాళ్లు నాలుగో రోజు ఊహించినంతగా ఆకట్టుకోలేదు. అశ్విన్ (70) ఆకట్టుకోవడంతో టీమిండియా దీటైన 488 స్కోరుకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు ధాటిగా ఆడింది. ఈ క్రమంలో ఓపెనర్లు కుక్ (46) ఆకట్టుకోగా, హమీద్ (62) అర్ధసెంచరీతో కదంతొక్కాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో వికెట్లేమీ కోల్పోకుండా 114 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టు మొదటి టెస్టు నాలుగో రోజు ముగిసే నాటికి 163 పరుగుల ఆధిక్యంలో ఉంది. చివరి రోజు వీలైంత ధాటిగా బ్యాటింగ్ చేసి, టీమిండియాను ఆలౌట్ చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. అయితే టీమిండియా ధాటిగా ఆడుతుండడంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మొదటి టెస్టు డ్రా దిశగా సాగే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News