: ‘చిల్లర ఉంటేనే రేషన్’ అన్నందుకు షాపును లూటీ చేసిన వినియోగదారులు
పెద్దనోట్లకు చిల్లర లేదన్న డీలర్ సమాధానానికి వినియోగదారులు రెచ్చిపోయారు. రేషన్ షాపును లూటీ చేశారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని బర్దువా గ్రామంలో జరిగింది. రేషన్ వస్తువులు తీసుకునేందుకు అక్కడి షాపునకు గ్రామస్తులు వెళ్లారు. ‘రూ.500, రూ.1000 నోట్లు తీసుకోనని, చిల్లర ఉంటేనే రేషన్ ఇస్తా'నని డీలర్ అహర్వార్ అనడంతో వినియోగదారులు ఆగ్రహించారు. ఆయనతో వాగ్వాదానికి దిగిన వినియోగదారులు, రేషన్ షాపులోని బియ్యం, చక్కెర, గోధుమలను దొరికన మేరకు దోచుకున్నారు. కాగా, ఈ సంఘటనపై గ్రామ సర్పంచ్ నన్హీలాల్ స్పందిస్తూ.. గత కొన్ని రోజులుగా రేషన్ ని అక్రమంగా తరలిస్తున్నాడని డీలర్ పై ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన గ్రామస్థులు రేషన్ ని లూటీ చేశారని చెప్పుకొచ్చారు.