: డిసెంబర్ 30 తర్వాత కూడా బ్లాక్ మనీ బయటపెట్టకపోతే నల్లధనవంతుల పనిపడతాం: మోదీ
ఈ ఏడాది డిసెంబర్ 30 తర్వాత కూడా బ్లాక్ మనీ బయటపెట్టని నల్లధనవంతుల పనిపడతామని, సంబంధిత శాఖాధికారుల దాడులు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఘాటుగా హెచ్చరించారు. జపాన్ పర్యటనలో ఉన్న మోదీ, కోబేలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, 1947 ఆగస్టు 15 నుంచి ఉన్న ఆదాయ వివరాలను కూడా బయటకు తీస్తామని, నల్లకుబేరులను వదిలిపెట్టమని అన్నారు. ఇందుకోసం ఎంత మంది అధికారులనైనా రంగంలోకి దింపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గంగానదిలో నోట్లు తేలియాడుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ఎన్నడూ లేనట్లుగా, గంగానదిలో నోట్లు కన్పిస్తున్నాయని, నల్లధనం దాచుకుంటే ఇటువంటి పరిస్థితి తప్పదని మోదీ హితవు పలికారు.