: తలాక్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి: బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్


తలాక్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని బాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత జావేద్ అక్తర్ తన అభిప్రాయాన్ని చెప్పారు. ఢిల్లీలో నిన్న నిర్వహించిన ‘సాహిత్య ఆజ్ తక్’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేయాలని పాతికేళ్లుగా తాను చెబుతున్నానని అన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దును వ్యతిరేకిస్తున్న అఖిల భారత ముస్లిం వ్యక్తిగత న్యాయ మండలిపై ఆయన మండిపడ్డారు. కాగా, దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు విషయమై ముసాయిదాను రూపొందించాలని, ఒక ఏడాదిపాటు అన్ని వర్గాలతోనూ చర్చలు జరపాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News