: ఆంధ్రప్రదేశ్ ను మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారు: భూమన
ఆంధ్రప్రదేశ్ ను మద్యాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇంటింటికీ పాల పాకెట్ల తరహాలో మద్యం పాకెట్లను సరఫరా చేయాలని భావిస్తున్నారని అన్నారు. బీచ్ లలో కూడా మద్యం షాపులు పెట్టి మన సంస్కృతిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. అడుగడుగునా అందుబాటులో ఉన్న మద్యం షాపులతో యువత జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. ఆదాయం కోసం ఏం చేయడానికైనా చంద్రబాబు సిద్ధమని... ఆయనపై జనం తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు.