: వరంగల్ సెంట్రల్ జైల్ నుంచి పరారైన ఖైదీలు
వరంగల్ సెంట్రల్ జైలు నుంచి సిబ్బంది కళ్లుగప్పి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. దుప్పట్ల సాయంతో జైలు గోడను దూకి వీరు పారిపోయారు. పరారైన ఖైదీలను బీహార్ కు చెందిన రాజా సింగ్, సైనిక్ సింగ్ లుగా గుర్తించారు. వీరిద్దరిలో ఒకరు హత్య కేసులో నిందితుడని తెలుస్తోంది. ఖైదీల పరారీని జైలు సూపరింటెండెంట్ ధ్రువీకరించారు. జరిగిన ఘటనను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఖైదీల పరారీతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.