: ట్రంప్ మాటలను ఆయుధంగా మలచుకోవాలని చూస్తున్న పాకిస్థాన్
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా తానే అధ్యక్షుడినైతే కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తానని, భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని గుర్తుచేస్తూ, భారత్ కు చెక్ పెట్టేందుకు పాక్ పెద్ద ప్లాన్ గీస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ను ఆశ్రయించడం ద్వారా భారత్ కు చెక్ చెప్పవచ్చని భావిస్తోంది. దీంతో ట్రంప్ ను కలిసి కశ్మీర్ సమస్యకు మధ్యవర్తిత్వం వహించమని కోరనుంది. తద్వారా కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే కుట్ర చేస్తోంది.