: గంగలో కొట్టుకొచ్చిన నోట్ల కోసం ఎగబడ్డ బరేలి వాసులు!
రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రభావం నల్లధనవంతులపై కొట్టొచ్చినట్లు కనపడుతుందనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఉత్తరప్రదేశ్ లోని బరేలి జిల్లాలోని గంగానదిలోకి ఈ పెద్ద నోట్లను గుర్తుతెలియని వ్యక్తులు విసిరేశారు. దీంతో, మీర్జాపూర్ వద్ద నదిలో వందలాది నోట్లు తేలియాడాయి. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి వెళ్లారు. స్థానికుల్లో కొందరు పడవలపై, మరికొందరు ఈత కొట్టుకుంటూ వెళ్లి ఆ నోట్లను సేకరించారు. ఈ నోట్లలో కొన్ని కాలిపోయి ఉండగా, మరికొన్ని నోట్లు చిరిగిపోయినట్లు సమాచారం. అయితే, నదిలోకి నోట్లు కొట్టుకు వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నది వద్దకు స్థానికులను రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు.