: మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూకు కోర్టు ధిక్కార నోటీసులు
కేరళకు చెందిన యువతి సౌమ్య అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా సుప్రీంకోర్టు పరిగణించింది. ‘సుప్రీం’ ఆదేశాల నేపథ్యంలో ఈ తీర్పుపై తన ఆలోచనలను వెల్లడించేందుకుగాను ఈరోజు కోర్టుకు ఆయన హాజరయ్యారు. ఈ తీర్పుపై కాకుండా, ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిపై కట్జూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయనకు కోర్టు ధిక్కార నోటీసులను జారీ చేసింది. కాగా, సౌమ్య కేసులో దోషి అయిన గోవింద చామీకి కింది కోర్టు వేసిన శిక్షను తగ్గించి సుప్రీంకోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందంటూ కట్జూ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఆ తీర్పుపై కట్జూ తన ఆలోచనలు వెల్లడించేందుకు కోర్టుకు హాజరు కావాలంటూ ‘సుప్రీం’ ఆదేశించడం విదితమే.