: 'బాహుబలి' నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు


తెలుగు సినీ పరిశ్రమకు ఊహించని షాక్ తగిలింది. 'బాహుబలి' సినిమా నిర్మాతలపై ఐటీ శాఖ దాడులు చేసింది. హైదరాబాదులోని 'బాహుబలి' నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖాధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంతో టాలీవుడ్ షాక్ కు గురైంది. కాగా, భారతీయ సినీ పరిశ్రమలో బ్లాక్ మనీ వినియోగంపై పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'బాహుబలి' నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News