: మరింత ప్రియం కానున్న విమాన చార్జీలు?


దూరాన్ని బట్టి వివిధ విమాన ప్రయాణాలపై లెవీ విధించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఈ రోజు నిర్ణ‌యం తీసుకుంది. ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు ఉద్దేశించిన నిధి కోసం ఒక లెవీ విధించ‌నున్న‌ట్లు పేర్కొంది. దీంతో విమానయాన సంస్థ‌లు విమాన ఛార్జీలు పెంచే అవ‌కాశం కనిపిస్తోందని విశ్లేష‌కులు చెబుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన వివ‌రాల ప్ర‌కారం వెయ్యి కిలోమీటర్ల లోపు దూరం వెళ్లే విమానాలకు రూ.7,500, 1000 నుంచి 1500 కిలోమీటర్ల వరకు దూరం వెళ్లే విమానాలకు రూ. 8000 లెవీ విధించ‌నున్నారు. అలాగే 1500 కిలోమీటర్లకు మించిన దూరం వెళ్లే స్వదేశీ విమానాలకు రూ. 8,500 చొప్పున కేంద్రం లెవీ విధించింది. వ‌చ్చేనెల 1వ‌ తేదీ నుంచి ఈ లెవీ అమ‌లులోకి వ‌స్తుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News