: అనంతపురంలోని కరవు ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తా: గుత్తిలో పవన్ కల్యాణ్
అనంతపురం జిల్లా గుత్తిలో నిర్వహించిన విద్యార్థుల ఇష్టాగోష్ఠిలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా జనసేన అధినేతని ఓ విద్యార్థిని ‘అనంతపురం కోసం మీరు ఏం చేయగలరు?’ అని ప్రశ్నించింది. దీనికి పవన్ కల్యాణ్ సమాధానం చెబుతూ... తనకు పాదయాత్ర చేయాలని ఉందని తెలిపారు. పాదయాత్ర చేసే శక్తి తనకు ఉందని అన్నారు. విద్యార్థులు అడిగే అన్ని ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం చెప్పలేనని పేర్కొన్నారు. అనంతపురంలోని కరవు ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. అక్కడి కరవు పరిస్థితులపై అధ్యయనం చేస్తానని, ఆ తరువాత అన్ని అంశాలను సమగ్రంగా చర్చించి పోరాడతానని చెప్పారు. కరవు ప్రాంతాల్లో మూడు రోజులు పర్యటించాలని అనుకుంటున్నానని అన్నారు.