: ఒక్కరిని ఏడిపిస్తే పది మంది తన్నాలి.. చెప్పుతో కొట్టాలి: పవన్ కల్యాణ్
ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగితే తప్పా మీకు ఆ చట్టం తీసుకురావాలని తెలియలేదా..? అని పవన్ కల్యాణ్ రాజకీయ నాయకులను ప్రశ్నించారు. అనంతపురం జిల్లా గుత్తిలో నిర్వహిస్తోన్న విద్యార్థులతో ఇష్టాగోష్ఠిలో ఆయన ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ... అమ్మాయిల వెంట పడేవారిని చెప్పుతో కొట్టాలని సూచించారు. దేశం బాగుపడాలంటే ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఒక్కరిని ఏడిపిస్తే పది మంది వెళ్లి తన్నాలని అన్నారు. అమ్మాయిలు ధైర్యంగా ఉంటేనే దేశం బాగుపడుతుందని చెప్పారు. అమ్మాయిల్లో ఎంతో ధైర్యం ఉంటుందని చెప్పారు. అమ్మాయిలు ప్రత్యేక హోదా మీద పోరాడాలని అబ్బాయిలకు ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు. పవన్ మాటలు విన్న అక్కడి అమ్మాయిలు ఉత్సాహంతో అరుపులు, కేకలు పెట్టారు.