: రిజర్వేషన్ అంశంపై అసెంబ్లీలో మీ ప్రశ్నను వినిపిస్తాను: పవన్ కల్యాణ్
అన్ని కులాలు సమానమనే తాను నమ్ముతానని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో నిర్వహిస్తోన్న విద్యార్థులతో ఇష్టాగోష్ఠిలో ఆయన ఓ విద్యార్థిని అడిగిన రిజర్వేషన్ల అంశంపై సమాధానం చెబుతూ... రిజర్వేషన్ అనేది చాలా సున్నితమైన సమస్య అని అన్నారు. ‘నేను ఏదైనా మాట్లాడితే అది అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. రిజర్వేషన్లు పొందలేని వారి ఆవేదన, బాధను అర్థం చేసుకోగలను. రిజర్వేషన్లతో నైపుణ్యం ఉన్న విద్యార్థులు దూరం అవుతున్నారని అంటున్నారు. అది నిజమే. రిజర్వేషన్ లేని కులాలవారు బాధపడుతున్నారు. అసెంబ్లీలో మీ ప్రశ్నను వినిపిస్తాను. పార్లమెంటులో కూడా వినిపిస్తాను. కులాన్ని గౌరవిస్తాను తప్ప నెత్తికెత్తుకోను’ అని పవన్ కల్యాణ్ అన్నారు. కులాలను బేస్ చేసుకునే ఎంతో మంది రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.