: రజనీతో మొదటిసారి మాట్లాడినప్పుడు ఆయన పాదాలను తాకాను: బాలీవుడ్ నటుడు సుధాంశు పాండే


రజనీకాంత్ తో మొదటిసారి మాట్లాడినప్పుడు ఆయన పాదాలను తాకానని ‘2.0’ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సుధాంశు పాండే చెప్పాడు. ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తుండగా, మరో విలన్ పాత్రలో సుధాంశు నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ లో తనకు ఎదురైన అనుభవాల గురించి ఒక ఇంటర్వ్యూలో సుధాంశు ప్రస్తావించాడు. రజనీకాంత్ తో కలిసి పనిచేసిన అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని, ఆయనతో మొదటిసారి మాట్లాడినప్పుడు ఆయన పాదాలను తాకానని, రజనీ తనను పట్టుకుని అభినందించారని సుధాంశు చెప్పుకొచ్చాడు. అంతకుముందు, ఈ చిత్ర దర్శకుడు శంకర్ గురించి కూడా ఆయన మాట్లాడాడు. ‘2.0’ చిత్రంలో నటించాలని కోరుతూ తనకు శంకర్ ఫోన్ చేశారని, వెంటనే చెన్నైకు వెళ్లి ఆయన్ని కలిశానని చెప్పారు. ఆయన చాలా సాధారణంగా ఉంటారని, ఎంతో పేరున్న దర్శకుడు ఆ విధంగా ఉండటం చిన్నవిషయం కాదంటూ శంకర్ కు కితాబిచ్చాడు.

  • Loading...

More Telugu News