: హుండీల డబ్బు డిపాజిట్ పై ఎలాంటి నిఘా ఉండదు: కేంద్ర ప్రభుత్వం
ఆలయాల హుండీల డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంపై ఎలాంటి నిఘా ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ డబ్బు డిపాజిట్ కు పరిమితులు లేవని, హుండీల సొమ్ముకు మాత్రమే ఈ మినహాయింపు ఇస్తున్నామని రెవెన్యూ శాఖ కార్యదర్శి హాస్ముఖ్ అధియా ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ వెసులుబాటు ఆలయాలకు మాత్రమే వర్తిస్తుంది తప్పా, వాటి కింద నడుస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు వర్తించదన్నారు. స్వచ్ఛంద సంస్థలు తమ డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసే సమయంలో సంబంధిత రికార్డులను కచ్చితంగా చూపించాల్సి ఉంటుందన్నారు.