: చిన్న నోట్ల దుమ్ము దులుపుతున్న బ్యాంకు అధికారులు
పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో చిన్ననోట్లు అయిన రూ.10, రూ.20 కట్టల దుమ్మును బ్యాంకు అధికారులు దులుపుతున్నారు. ముఖ్యంగా, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లోని పలు బ్యాంకుల్లో ఈ పరిస్థితి నెలకొంది. పెద్దనోట్లు చలామణిలో ఉన్నంత కాలం ఆయా నోట్లను లేదా కట్టలను తీసుకునేందుకు అధిక శాతం ఖాతాదారులు ఇష్టపడేవారు కాదు. కానీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పెద్దనోట్లను మార్చుకునేందుకు వస్తున్న ఖాతాదారులు రూ.100 నోట్లతో పాటు రూ.10, రూ.20 చిన్న నోట్లను కూడా తీసేసుకుంటున్నారు.