: మోదీ నిర్ణయం వెనుక ఎంతో దూరదృష్టి ఉంది: షారుఖ్


నల్లధనం, నకిలీ కరెన్సీని అంతం చేయాలనే లక్ష్యంతో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇది ఎంతో దూరదృష్టితో ప్రధాని తీసుకున్న నిర్ణయమని... చాలా గొప్పదని ప్రశంసించాడు. దీని వెనుక ఎలాంటి రాజకీయ ప్రేరేపణలు లేవని చెప్పాడు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది సానుకూల మార్పును తీసుకొస్తుందని తెలిపాడు.

  • Loading...

More Telugu News