: భారీ బందోబస్తు మధ్య సభ ప్రాంగణానికి చేరుకున్న పవన్ కల్యాణ్.. ఏం చెప్పబోతున్నారని ఉత్కంఠ
అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించతలపెట్టిన సీమాంధ్రహక్కుల చైతన్య సభ ప్రాంగణానికి జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్ చేరుకున్నారు. ఆయన దాదాపు గంటన్నర పాటు ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఈ సభలో ఏం చెప్పబోతున్నారనే అంశంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. పవన్ ఏం మాట్లాడతారో తమకు తెలియదని కొందరు అభిమానులు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రత్యేక హోదాపైనే మాట్లాడతారని తాము అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. హోదా అంశంతో పాటు సామాజిక సమస్యలపై కూడా పవన్ కల్యాణ్ మాట్లాడతారని వార్తలు వస్తున్నాయి. అనంతపురంలో ఎక్కడ చూసినా జనసేన బ్యానర్లే కనపడుతున్నాయి. సభా ప్రాంగణంలో పవన్ కల్యాణ్ జిందాబాద్ నినాదాలు మార్మోగుతున్నాయి.