: మోదీ నిర్ణయం అక్రమార్కుల నడ్డి విరిచింది: కైలాశ్ సత్యార్థి


పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అక్రమార్కుల నడ్డి విరిచిందని నోబెల్ బహుమతి గ్రహీత, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎన్నో ఉద్యమాలు చేపట్టిన కైలాశ్ సత్యార్థి అభిప్రాయపడ్డారు. మోదీ తీసుకున్న నిర్ణయంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తున్నానని, మానవ అక్రమ రవాణాకి పాల్పడే వారి వద్ద ఉండేది అంతా నల్లధనమేనని, తాజా నిర్ణయంతో వారి కథ ముగుస్తుందని అన్నారు. చిన్నపిల్లలు, మహిళల అక్రమ తరలింపు వ్యవహారాలు నల్లధనానికి ప్రధాన వనరుగా మారాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అక్రమ రవాణాకు గురై బానిసలుగా మారిన వారి సంఖ్య దాదాపు 46 మిలియన్లు కాగా, అందులో 40 శాతం మంది భారతీయులేనన్నారు.

  • Loading...

More Telugu News