: పోస్టాఫీసుల్లోకి చేరుకున్న కొత్త నోట్లు... ప్రజల ముఖాల్లో ఆనందం
హైదరాబాద్‌లోని పోస్టాఫీసులకి కొత్త కరెన్సీ నోట్లు చేరాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆబిడ్స్ జీపీవో వద్ద ఉదయం నుంచి బారులు తీరిన ప్రజల ముఖాల్లో ఆనందం కనిపించింది. మరికాసేపట్లో వారికి కొత్త నోట్లు అందనున్నాయి. కనీసం నాలుగు వేలయినా తీసుకొని నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలని పోస్టాఫీసుకి వచ్చినట్లు అక్కడి క్యూలైన్లలో నిలబడిన ప్రజలు మీడియాకు తెలిపారు. ఉదయం పది గంటల నుంచి తాము అక్కడే నిలబడి ఉన్నామని, కొందరు కనీసం టిఫిన్ కూడా చేయలేదని అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో కష్టాలు ఎదుర్కొంటున్నట్లు కొందరు ప్రజలు అంటోంటే, మరి కొందరు కొన్ని రోజులు ఇబ్బందులు తప్పవని, ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.