: రాజ్‌కోట్ టెస్టు: రూట్, అలీ, స్టోక్స్ ల శతకాలతో 500 మార్కు దాటిన ఇంగ్లండ్ స్కోరు
ఇంగ్లండ్, భారత్ క్రికెట్ టీమ్‌ల మధ్య గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో మొదటి ఇన్సింగ్స్ కొనసాగుతోంది. రెండో రోజు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్ల దూకుడును భారత బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. దీంతో ఇంగ్లండ్ స్కోరు 500 మార్కును దాటింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో కుక్ 21, హమీద్ 31, రూట్ 124, డకెట్ 13, అలీ 117, బైర్‌స్టో 46, వోక్స్ 4, రషీద్ 5 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో స్టోక్స్ 121, అన్సారీ 15 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేష్ కి ఒక వికెట్టు, షమీ, అశ్విన్‌లకు రెండేసి వికెట్లు దక్కగా జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 144 ఓవర్లకి ఎనిమిది వికెట్ల నష్టానికి 507 పరుగులుగా ఉంది. ఇంగ్లండ్ కి ఎక్స్ ట్రాల రూపంలో 10 పరుగులు వచ్చాయి. రన్ రేట్ 3.48 గా ఉంది.