: తాను నిర్మాతగా ఎందుకు మారిందో వివరించిన ప్రియాంక


ఎవరి అండాదండా లేకుండానే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా... తన అందం, అభినయంతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాదు, 'క్వాంటికో' టీవీ సిరీస్ తో హాలీవుడ్ లో అడుగుపెట్టి, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. దీనికితోడు, నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తోంది. పర్పుల్ పెబ్బెల్ పిక్చర్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ కంపెనీని స్థాపించింది ప్రియాంక. తన సినీ నిర్మాణంపై ఆమె మాట్లాడుతూ, సినిమాల్లో నటించాలనే కోరికతో దేశం నలుమూలల నుంచి ముంబైకి ఎంతోమంది వస్తుంటారని... కానీ, తీవ్రమైన పోటీతో వారందరికీ అవకాశాలు దక్కవని చెప్పింది. అలాంటి వారిలోని టాలెంట్ ను వెలుపలికి తీసుకురావడానికే తాను ప్రొడక్షన్ కంపెనీని స్థాపించానని.... వారికి తనవంతు సాయం చేస్తానని తెలిపింది. తన బ్యానర్ లో నిర్మించే సినిమాలకు భాషతో సంబంధం లేదని... అన్ని రకాల సినిమాలను నిర్మిస్తామని చెప్పింది.

  • Loading...

More Telugu News