: ట్రంప్ విజయంపై స్పందించిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన వారితో కలసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లింక్డ్ ఇన్ లో ఆయన పోస్ట్ చేశారు. ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించారని... ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎన్నికలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయని తెలిపారు. తాము విలువలకు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామని... విభిన్నమైన సంస్కృతులను కూడా కలుపుకుపోతామని సత్య నాదెళ్ల చెప్పారు.