: మోదీపై విరుచుకుపడిన అసదుద్దీన్ ఒవైసీ.. దారుణ పరిస్థితి కల్పించారని మండిపాటు
అవినీతి నిర్మూలన కోసం పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ నిర్ణయం అనుచితమని, దినసరి కూలీలు, ప్లంబర్లు, మెకానిక్‌లు, డ్రైవర్లు వంటి వారితో ముడిపడే అంశాన్ని పట్టించుకోకుండా దారుణమైన పరిస్థితి కల్పించారంటూ విరుచుకుపడ్డారు. దేశంలో రెండు శాతం మాత్రమే క్యాష్‌లెస్ లావాదేవీలు జరుగుతున్నాయన్న ఆయన, వారి కోసం మిగతా 98 శాతాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ అకస్మాత్తు ప్రకటనతో ప్రజలు బెంబేలెత్తారన్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన మోదీ రూ.2వేల నోటు ఎందుకు ప్రవేశపెడుతున్నారో చెప్పాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.