: మనం కోరుకోని ఫలితాలివి... చాలా బాధగా ఉంది: ఓటమి తరువాత తొలిసారి మాట్లాడిన హిల్లరీ క్లింటన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓటమి పాలైన హిల్లరీ క్లింటన్ తొలిసారి తన అనుచరులను, మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. విజేత డొనాల్డ్ ట్రంప్ కు అభినందనలు తెలిపారు. "ఈ ఫలితాన్ని మనం కోరుకోలేదు. మనం చాలా శ్రమించాం. నన్ను క్షమించండి. ఈ ఎన్నికల్లో దేశం కోసం ప్రజల ముందు మనం ఉంచిన దృక్పథం, మనం చూపిన విలువలు అత్యధికుల మనసులను మెప్పించలేదు. దేశాన్ని ఒకతాటిపైకి తెచ్చే క్రమంలో మనం నిర్వహించిన ప్రచారం నాకు గర్వాన్ని, సంతృప్తిని కలిగించింది. దేశ ప్రజల పట్ల నేను కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నాను. మనం సమర్థమైన, తిరుగులేని ప్రచారం నిర్వహించాం. నా జీవితంలో అత్యంత గర్వించిన సందర్భం, ఈ ఎన్నికల్లో మీకు ప్రతినిధిగా నిలబడటమే. అమెరికన్ల కలలు నెరవేర్చేందుకు సమష్టిగా కలసి పనిచేయాలి" అని అన్నారు.