: అపోలో ఆసుపత్రిలో వార్డుకు మారిన జయలలిత
ఊపరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో గత సెప్టెంబర్ 22వ తేదీ నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వార్డుకు మారారు. ఇంతవరకు ఐసీయూ విభాగంలో ఆమెకు దేశవిదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్సనందించారు. ఆమె కోలుకున్నారని, ద్రవాహారం అందిస్తున్నామని, స్వయంగా శ్వాసపీల్చుకుంటూ చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను ఐసీయూ నుంచి 'ఎల్' అనే వీఐపీ వార్డుకు తరలించినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నెలకుపైగా వెంటిలేటర్ పై ఉన్న ఆమె క్రమక్రమంగా సహజసిద్ధంగా శ్వాస పీల్చుకోగలుగుతుండడంతో, తన చుట్టూ ఏం జరుగుతుందో ఆమె అర్థం చేసుకోగలుగుతున్నారని, తనకు ఆసుపత్రి వర్గాలు అందిస్తున్న చికిత్స వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారని తెలుస్తోంది.