: పెద్దనోట్ల రద్దుపై పేలుతున్న ‘జోక్స్’లో కొన్ని!
అవినీతి పరుల, నల్లకుబేరుల, నకిలీ కరెన్సీ రాకెట్ల ఆటకట్టించడానికి పెద్దనోట్లను ప్రధాని మోదీ రద్దు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే సమయంలో, కడుపుబ్బ నవ్వించే జోక్ లు సామాజిక మాధ్యమాల వేదికగా పేలుతున్నాయి. ఈ జోక్ లను షేర్ చేసుకునే నెటిజన్ల సంఖ్య బాగానే ఉంది. కడుపుబ్బ నవ్విస్తున్న ఆ జోక్ లలో మచ్చుకు కొన్ని... ‘ఈరోజు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా.. మీకు గరిష్టంగా విధించే ఫైన్ వంద రూపాయలే’, ‘రద్దయిన పెద్దనోట్లు ఎలా చెల్లుబాటు చేసుకోవాలని బాధపడుతున్నారా? అయితే, మా దగ్గరకు రండి, ఎలాంటి ప్రశ్నలు వేయకుండానే, కిలోల లెక్కన తీసుకుంటాం. కిలో రూ.12 మాత్రమే’, ‘భర్తలకు తెలియకుండా భార్యలు దాచిన పెద్దనోట్లు ఇప్పుడు కచ్చితంగా బయటకు వస్తాయ్’, ‘రద్దయిన పెద్ద నోట్లు ఆసుపత్రుల్లో చెల్లుతాయని మోదీ ప్రకటించారు. ఎందుకంటే, రద్దయిన వార్త వినగానే అవినీతిపరులు గుండెపోటుతో ఆసుపత్రుల్లోనేగా చేరేది’ అంటూ నల్లధనవంతులకు బాగానే చురకలు అంటించారు.