: ఆన్ లైన్ కొనుగోళ్లలో క్యాష్ ఆన్ డెలివరీ లేదు: ఈ కామర్స్ సంస్థలు


ప్రధాని మోదీ నిర్ణయంతో ఈ కామర్స్ రంగం తాత్కాలికంగా క్యాష్ ఆన్ డెలివరీ సేవలను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రముఖ ఆన్‌ లైన్‌ వ్యాపార సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌, స్నాప్‌ డీల్‌ సంస్థలు ప్రకటన విడుదల చేశాయి. క్యాష్‌ ఆన్‌ డెలివరీ (సీఓడీ) పై వస్తువులను విక్రయించే సదుపాయాన్ని నిలిపివేస్తున్నందుకు సూచనగా, ఈ సంస్థల వెబ్ సైట్లలో ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ’ సౌకర్యం తాత్కాలికంగా అందుబాటులో లేదు అనే సందేశాన్ని పొందుపరిచారు. స్నాప్‌ డీల్‌, ఫ్లిప్‌ కార్ట్‌ సైట్లలో 2000 రూపాయలు పైబడిన వస్తువులకు మాత్రమే సీఓడీ సౌకర్యం ఉండదని తెలుస్తోంది. ఉబర్‌ క్యాబ్స్‌ ప్రస్తుతానికి నగదు స్వీకరిస్తున్నప్పటికీ 500, 1000 రూపాయల నోట్లను స్వీకరించడం లేదని మెసేజ్ లు పంపుతోంది. ఓలా క్యాబ్స్ మాత్రం ఇలాంటి మెసేజ్ లు ఏవీ పంపకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News