: సరదాగా క్రికెట్ ఆడిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడలోని జక్కంపూడి హౌసింగ్ కాలనీలో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉన్నత పాఠశాల, కమ్యూనిటీ హాలును ప్రారంభించారు. అనంతరం మూలపాడులో పర్యటించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన ఏసీఏ కాంప్లెక్స్‌ను ప్రారంభించి అక్కడి క్రీడాకారులతో కాసేపు ముచ్చటించారు. అక్కడ మైదానంలో క్రికెట్ బ్యాట్ చేతబట్టి విద్యార్థులతో కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు.