: ఆరోజు మధ్యాహ్నం ట్రంప్ ప్రమాణస్వీకారం?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ మధ్యాహ్నం ఆ దేశ 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్ డీసీలోని 'యునైటెడ్ స్టేట్స్ కేపిటోల్' భవనంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతకుముందు, అమెరికా కొత్త ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. కాగా, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 20వ తేదీతో ముగియనుంది.