: పెద్దనోట్ల ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్ పోర్టులోనూ తప్పని తిప్పలు!


ఏటీఎంలు మూతపడటం.. ఫారిన్ ఎక్స్ఛేంజ్ ల్లో డబ్బులేక పోవడంతో విదేశాల నుంచి భారత్ కు వస్తున్న వారికి తిప్పలు తప్పట్లేదు. హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఖతార్, దుబాయ్, అబూదాబి సహా పలు దేశాల నుంచి ఈ రోజు ఉదయం వేలాది ప్రయాణికులు ఇక్కడికి చేరుకున్నారు. హోటళ్లు, ట్యాక్సీలు, రెష్టారెంట్ లు ఎక్కడికి వెళ్లినా పెద్దనోట్లు చెల్లవంటూ చెప్పడంతో ప్రయాణికులు బిక్కమొహం వేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు తాము పడ్డ ఇబ్బందులను మీడియాతో పంచుకున్నారు.

  • Loading...

More Telugu News