: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం... హిల్లరీకి షాక్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. గెలుపు తనదే అంటూ మొదటి నుంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న డిమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు షాక్ ఇచ్చారు ట్రంప్. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలలో... ట్రంప్ 276 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకున్నారు. హిల్లరీ 218 ఓట్లతో వెనుకబడిపోయారు. అధ్యక్ష పీఠం అధిరోహించడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 270 ఓట్లు మాత్రమే. దీంతో, అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో ట్రంప్ 27, హిల్లరీ 18 రాష్ట్రాల్లో గెలుపొందారు. మరో 5 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది.