: హిల్లరీ క్లింటన్ నివాసం నుంచి ఒక్కొక్క‌రుగా వెళ్లిపోతున్న ఆమె మ‌ద్ద‌తుదారులు!


అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల కౌంటింగ్ మ‌రి కాసేప‌ట్లో పూర్తి కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వెలువ‌డిన ఫ‌లితాల్లో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి హిల్ల‌రీ క్లింట‌న్‌కు 215, రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్‌కి 247 ఎల‌క్టోర‌ల్ ఓట్లు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ కే స్పష్టమైన అధిక్యం కనిపిస్తుండడంతో హిల్లరీ క్లింటన్ నివాసం నుంచి ఆమె మద్దతుదారులు ఒక్కొక్క‌రుగా వెళ్లిపోతూ కనిపిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హిల్ల‌రీ మ‌ద్ద‌తుదారుడు జాన్ పొడెస్టా మీడియాతో మాట్లాడుతూ.. హిల్లరీ క్లింట‌న్‌కి మ‌ద్ద‌తు తెలిపిన వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అని వ్యాఖ్యానించారు. మ‌రోవైపు అధ్యక్ష పీఠాన్ని ఎక్కే దిశగా వెళుతోన్న డొనాల్డ్ ట్రంప్ నివాసం వ‌ద్ద ఆయ‌న మ‌ద్ద‌తుదారుల సందడి క‌నిపిస్తోంది. సంబ‌రాలు చేసుకోవ‌డానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News