: ట్రంప్ ఎఫెక్ట్ ఎక్కువగా భారతీయ ఐటీ నిపుణులు, ఐటీ కంపెనీలపైనే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి అత్యంత సమీపంలోకి ట్రంప్ వచ్చారు. ట్రంప్ అధ్యక్షుడైతే మన దేశ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు గడ్డు కాలమే అని తెలుస్తోంది. ముఖ్యంగా హెచ్1బి వీసా ప్రోగ్రామ్ పైనే ఆయన ఎక్కువ టార్గెట్ చేసే అవకాశం ఉంది. దీంతో, డాలర్ డ్రీమ్స్ తో అమెరికా వెళ్లే ఐటీ నిపుణులకు, భారత ఐటీ ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ తగలనుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి భారత ఐటీ దిగ్గజ కంపెనీలకు ట్రంప్ ఎఫెక్ట్ భారీగా ఉండొచ్చు. అమెరికన్ల ఉద్యోగాలను ఇండియా, చైనా, సింగపూర్ దేశస్తులు తన్నుకుపోతున్నారని... తాను అధ్యక్షుడినైతే వాటిని అరికడతానని ట్రంప్ శపథం చేసిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ఉద్యోగ నిమిత్తం యూఎస్ వెళ్లే వలసవాదులపై ఆంక్షలు విధిస్తానని కూడా ట్రంప్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ రాకతో... ఇమ్మిగ్రేషన్ రూల్స్ చాలా కఠినతరం అయ్యే అవకాశం ఉంది.