: కెనడా వైపు పరుగులు తీస్తున్న అమెరికాలోని విదేశీ ఉద్యోగులు... ఇమిగ్రేషన్ వెబ్ సైట్ క్రాష్!


గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో, ప్రస్తుతం ఆందోళనకు గురవుతున్న పలువురు విదేశీ ఉద్యోగులు, కెనడాకు వెళ్లాలన్న ఆలోచనతో ఇమిగ్రేషన్ కోసం పెద్దఎత్తున ప్రయత్నిస్తున్న వేళ, కెనడా ఇమిగ్రేషన్ వెబ్ సైట్ క్రాష్ అయినట్టు తెలుస్తోంది. www.cic.gc.ca/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలని చూస్తుంటే, ఎర్రర్ మెసేజ్ వస్తోందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. అమెరికా, ఆసియాలతో పాటు కెనడా యూజర్లకూ 'ఇంటర్నల్ సర్వీస్ ఎర్రర్' అన్న మెసేజ్ కనిపిస్తోందని పేర్కొంది. ట్రంప్ టోర్నడో ఎఫెక్ట్ కెనడాపై కనిపిస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, వైట్ హౌస్ లో ట్రంప్ కాలుపెడితే, తాము కెనడాకు పారిపోతామని గతంలో పలువురు విదేశీ నిపుణులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, ట్వీట్లతో జోకుల మీద జోకులు వేసుకున్న సంగతి తెలిసిందే. ట్రంప్ గెలిస్తే, అమెరికన్లు సైతం కేప్ బ్రిటన్ ద్వీపానికి శరణార్థులుగా వెళ్లిపోవాలని కూడా వ్యాఖ్యలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News