: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ 76 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ హమీద్ ను ఇండియన్ టాప్ స్పిన్నర్ అశ్విన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. 6 ఫోర్ల సాయంతో 31 పరుగులు చేసిన హమీద్ ను అశ్విన్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. మరో ఓపెనర్ కుక్ కూడా 21 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆట తొలి సెషన్ లోనే పిచ్ పై మన స్పిన్నర్లు మంచి స్పిన్ రాబడుతుండటం గమనార్హం. ఇంగ్లండ్ ప్రస్తుత స్కోరు రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు. రూట్ (29), డకెట్ (1) క్రీజులో ఉన్నారు.