: ఎంతాశ్చర్యం... మంత్రులకు, అధికారులకు తెలియకుండానే ప్రధాని నోట్ల రద్దు!


దేశవ్యాప్తంగా పెను సంచలనానికి, చర్చకు తెరదీసిన చలామణిలో ఉన్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే ముందు తెరవెనుక పెద్ద కథే నడిచింది. నోట్ల రద్దు గురించి ముందుగానే ప్లాన్ వేసుకున్న మోదీ సహా అతి ముఖ్యులైన కొద్ది మంది రహస్యంగా కొత్త నోట్ల ముద్రణ, రద్దు నిర్ణయం ప్రకటించడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివి తీసుకున్నారు. అయితే, ఈ విషయాలేవీ ప్రధాని, ఆర్థికమంత్రి, ఆర్బీఐలోని అతికొద్ది మంది ప్రముఖులకు తప్ప ఎవరికీ తెలియదు. చాలా మంది కేంద్ర మంత్రులకు కూడా విషయం తెలియదంటే, విషయాన్ని ఎంత సీక్రెట్ గా ఉంచారో తెలుసుకోవచ్చు. నోట్ల రద్దు విషయాన్ని పకడ్బందీగా వెల్లడించాలన్న ఉద్దేశంతోనే సమాచారాన్ని రహస్యంగా ఉంచామని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. ప్రస్తుతం క్షణం విశ్రాంతి లేకుండా కొత్త నోట్లను ముద్రిస్తున్నామని, బ్యాంకులకు కొత్త నోట్ల రవాణా ప్రారంభమైందని వివరించారు.

  • Loading...

More Telugu News