: ప్రధాని నిర్ణయంతో నేను, జగన్ షాకయ్యం.. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యంగ్యం


రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనతో తాను, సోదరుడు వైసీపీ అధినేత జగన్ షాకయ్యామని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ప్రధాని ప్రకటన విన్న వెంటనే తాను బీరువా తీసి చూసుకున్నానని, అందులో 26 వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయని, వాటిని ఎలా మార్చుకోవాలా అన్న ఆందోళన మొదలైందని అన్నారు. తనకే అంత ఆందోళనగా ఉంటే జగన్‌మోహన్‌రెడ్డి ఇంకెంతగా ఆందోళన చెంది ఉంటారోనని అన్నారు. బెంగళూరు వైట్‌హౌస్‌లోని భూగర్భంలో దాచిన డబ్బును ఏం చేయాలో తెలియక ఆయన షాకై ఉంటారని అన్నారు. చంద్రబాబు ఎప్పటి నుంచే రూ.వెయ్యి, రూ.500 నోట్లు రద్దు చేయాలని చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రధాని కీలక నిర్ణయం వెనక చంద్రబాబు ప్రభావం ఉందని సోమిరెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News