: జమ్ముకశ్మీర్‌లో బీఎస్ఎఫ్ క్యాంప్‌ను సందర్శించిన అక్షయ్‌కుమార్.. జవాన్లు రియల్ హీరోలని ఉద్వేగపూరిత ప్రసంగం
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఈ రోజు జమ్ముకశ్మీర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంప్‌ను సందర్శించాడు. అక్కడ అమర జవాన్లకు నివాళులు అర్పించిన అక్షయ్.. అనంతరం జవాన్లు రియల్ హీరోలని ఉద్వేగపూరిత ప్రసంగం చేశాడు. తాను జవాన్లను కలుసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను రీల్ హీరో అని, జవాన్లు రియల్ హీరో అని తాను ఎప్పుడూ చెబుతుంటానని అన్నాడు. ఈ సందర్భంగా ఆయన కాసేపు జవాన్లతో ముచ్చటించి, వారు దేశానికి చేస్తోన్న సేవలను కొనియాడాడు.