: ఇండియా, పాకిస్థాన్ సరిహద్దులో టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ


భారత్, పాకిస్థాన్ సరిహద్దు వద్దకు వచ్చిన విషయాన్ని నమ్మలేకపోతున్నానని ప్రముఖ టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ అన్నాడు. తన కుటుంబంతో కలసి బ్రహ్మాజీ వాఘా బోర్డర్ వద్దకు వెళ్లాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపాడు. అంతేకాదు సైనికుడితో కలసి దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. తాను ఇక్కడకు రావడానికి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సహాయం చేసిందని తెలిపాడు. వాఘా బోర్డర్ కు రావడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పాడు. వాఘా బోర్డన్ ను సందర్శించేందుకు రకుల్ తండ్రి వీఐపీ పాస్ ను ఏర్పాటు చేశాడట.
  • Loading...

More Telugu News