: మీ దేశానికి వస్తే మాకు ఖర్చులేంటి? మ్యాచ్ ఉందో లేదో తేల్చండి: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆగ్రహం
తమ వద్ద నిధుల బదిలీకి ఆటంకాలు ఏర్పడినందున ఆటగాళ్ల ప్రయాణ, హోటల్, ఆతిథ్య తదితర ఖర్చులను భరించుకోవాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును బీసీసీఐ కోరగా, ఈసీబీ కాస్తంత ఘాటుగానే స్పందించింది. క్రికెట్ పోటీల నిమిత్తం తాము పర్యటనకు వస్తే, ఖర్చులన్నీ తమనే భరించుకోవాలని చెప్పడం భావ్యం కాదని, ఇప్పుడిక మ్యాచ్ నిర్వహణపైనే నీలినీడలు కమ్మే వ్యాఖ్యలు చేస్తున్నారని ఈసీబీ ఆరోపించింది. ఇప్పటికే రాజ్ కోటకు చేరుకుని తమ ఖర్చుతో హోటల్ లో ఉంటున్న ఇంగ్లండ్ ఆటగాళ్లకు, అసలు మ్యాచ్ ఉంటుందా? ఉండదా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలని అల్టిమేట్టం ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఈ విషయంలో బీసీసీఐ అఫిడవిట్ ను సుప్రీంకోర్టు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.