: భోజనాల వేళ ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ 'కుక్'పై జోకేసిన మోదీ
సందర్భానుసారం చుట్టూ ఉన్న వాళ్లను నవ్వించేలా తనదైన శైలిలో మాట్లాడటంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందుంటారన్న సంగతి తెలిసిందే. బ్రిటన్ ప్రధాని థెరిసా మే భారత పర్యటనలో ఉన్న వేళ, ఆమెకు మోదీ ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ వేసిన జోక్ కు అందరూ నవ్వుకున్నారు. విందులో చేసిన వంటకాలు బాగున్నాయని థెరిసా కితాబిచ్చిన వేళ, "రుచికరమైన భోజనం చేసే కుక్ మా దగ్గర ఉన్నాడు. కానీ అసలైన కుక్ మీ క్రికెట్ జట్టుతో పాటు భారత పర్యటనకు వచ్చాడు" అని చమత్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రాజ్ కోట్ లో జరగనున్న టెస్టులో బాగా ఆడిన జట్టే విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.